గ్రేటర్ ఎన్నికల వేళ ముషీరాబాద్ పరిధిలోని అడిక్‌మెట్ డివిజన్‌లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. డివిజన్ పరిధిలోని రాంనగర్ మీ సేవా వద్ద తెరాస, భాజపా శ్రేణులు బాహాబాహీకి దిగాయి. తెరాస నేతలు ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారని ఆరోపిస్తూ భాజపా నాయకులు ఆందోళనకు దిగారు. బయటి వ్యక్తులకు డివిజన్‌లో పనేంటని నిలదీశారు . ఈ క్రమంలోనే ఇరు వర్గాలు పోలీసుల సమక్షంలో పరస్పరం దాడులు చేసుకున్నాయి.
ఆడిక్మెట్లో తెరాస, భాజపా నాయకుల వాగ్వాదం - గ్రేటర్ ఎన్నికలు 2020
ముషీరాబాద్ నియోజకవర్గంలోని ఆడిక్మెట్ డివిజన్‌లో తెరాస, భాజపా నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది. తెరాస నేతలు ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారని భాజపా నేత ప్రకాశ్ గౌడ్ ఆరోపించారు.
ఆడిక్మెట్లో తెరాస, భాజపా నాయకుల వాగ్వాదం
తెరాస నాయకుడు సుధాకర్ గుప్తా ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నాడని భాజపా నేత ప్రకాష్ గౌడ్ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. తెరాస నేతలు ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారని ప్రకాష్ గౌడ్ ఆరోపించారు. బయట వ్యక్తులకు ఈ డివిజన్‌లో ఏం పని అంటూ తెరాస నేతలను ప్రకాష్ గౌడ్ నిలదీశారు. దీంతో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పాడ్డాయి.