తెలంగాణ

telangana

ETV Bharat / state

Mallareddy Trees Issue: 'మంత్రి మల్లారెడ్డి హరిత విధ్వంసం...! ఫంక్షన్​ హాల్​ కోసమేనా?' - Telangana news

Mallareddy Trees Issue: రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి మరోసారి వార్తల్లో నిలిచారు. కొత్తగా కట్టిన తన కన్వెన్షన్ హాల్​ ముందు ఉన్న చెట్లను నరికివేయించి విమర్శలపాలవుతున్నారు. మంత్రి ఫంక్షన్ హాల్​ కనబడటం లేదని చెట్లను నరికివేయించినట్లుగా ప్రతిపక్షాల నాయకులు ఆరోపిస్తున్నారు.

Mallareddy
Mallareddy

By

Published : Apr 8, 2022, 4:23 PM IST

Mallareddy Trees Issue: రాష్ట్ర ప్రభుత్వం హరితహారంలో భాగంగా నాటిన చెట్లను తొలగించి మంత్రి మల్లారెడ్డి మరోసారి వార్తల్లోకి ఎక్కారు. మేడ్చల్ జిల్లా శామీర్​పేట్ మండలం ఆలియబాద్ చౌరస్తాలో ఇటీవల మంత్రి నూతనంగా సీఎంఆర్ కన్వెన్షన్ హాల్​ను ప్రారంభించారు. అయితే తన కన్వెన్షన్ హాల్ ముందు నాటిన చెట్లు పెద్దవిగా కావడం వల్ల తన హాల్ కనబడడం లేదంటూ సుమారు 65 చెట్లలో కొన్ని చెట్లను వేర్లతో సహా పెకిలించేశారు. మరి కొన్నింటి చెట్ల కొమ్మలను నరికేయించారు.

సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు ఫారెస్ట్ రేంజ్ అధికారి విజయ్ భాస్కర్ నేతృత్వంలోని బృందం ఘటన స్థలిని పరిశీలించింది. కేవలం చెట్ల కొమ్మలు నరికేసినట్లు ఆనవాళ్లు కనబడుతున్నాయని... కానీ వేర్లతో సహా చెట్లను పీకిన ఆనవాళ్లు కోసం దర్యాప్తు చేస్తున్నామని ఫారెస్ట్ అధికారులు చెబుతున్నారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. చెట్లు నరికిన ప్రాంతాన్ని మేడ్చల్ కాంగ్రెస్ నాయకుడు హరివర్ధన్ రెడ్డి పరిశీలించారు. మల్లారెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మంత్రి మల్లారెడ్డి చెట్లను నరికివేయించారంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మంత్రి మల్లారెడ్డి కన్వెన్షన్ హాల్

ఇదీ చదవండి: యాదాద్రిలో భక్తుల అవస్థలు.. లక్ష్మీ పుష్కరిణిలో నీళ్లు లేక ఇక్కట్లు

ABOUT THE AUTHOR

...view details