ప్రజల్లో చైతన్యానికి రోడ్డు భద్రతా వారోత్సవాలు... - traffic ci swamy
వాహనం నడిపేటపుడు జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదాల బారిన పడే అవకాశం ఉంది. రోడ్డు ప్రమాదాల్లో రాష్ట్రంలో ఏటా వేలమంది ప్రాణాలు కోల్పోతున్నారు. అలాంటి ప్రమాదాల నివారణకు భద్రతా వారోత్సవాల పేరిట పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు.
road safety book
రాష్ట్రాన్ని ప్రమాద రహితంగా చూడాలనేదే తమ ఆకాంక్ష అని ట్రాఫిక్ సీఐ స్వామి పేర్కొన్నారు. చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల పెద్ద మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని అభిప్రాయపడ్డారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలు పాటించి పోలీసులకు సహకరించాలని కోరారు.