దళిత, గిరిజన ఆత్మగౌరవ దీక్షలో భాగంగా.. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మూడుచింతలపల్లికి చేరుకున్నారు. భారీగా తరలివచ్చిన పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి దీక్ష ప్రారంభించారు. అంతకు ముందుగా రేవంత్ రెడ్డి.. శామీర్‌పేట కట్టమైసమ్మ ఆలయానికి చేరుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపించి నూతన వస్త్రాలు సమర్పించారు. రేవంత్ రెడ్డికి స్వాగతం పలికేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. గజమాల వేసి, బాణా సంచా కాల్చి, డప్పు చప్పుళ్లతో ఘన స్వాగతం పలికారు.
REVANTH REDDY: మూడుచింతలపల్లిలో రేవంత్ రెడ్డి దళిత, గిరిజన ఆత్మగౌరవ దీక్ష - మూడుచింతలపల్లి బయలుదేరిన రేవంత్ రెడ్డి
దళిత, గిరిజన ఆత్మగౌరవ దీక్షలో భాగంగా కేసీఆర్ దత్తత గ్రామం మేడ్చల్ జిల్లా మూడుచింతలపల్లిలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దీక్ష ప్రారంభించారు. శామీర్ పేట కట్టమైసమ్మ ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపించిన అనంతరం మూడుచింతలపల్లికి భారీ ఎత్తున కార్యకర్తలతో చేరుకున్నారు. దీక్ష రేపు సాయంత్రం వరకు కొనసాగనుంది.
మూడుచింతలపల్లికి చేరుకున్నాక అక్కడ రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేడ్కర్, మాజీ సమితి అధ్యక్షులు వీరారెడ్డిల విగ్రహాలకు రేవంత్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అక్కడ నుంచి భారీ ప్రదర్శనగా దీక్షా సభాస్థలికి చేరుకున్నారు. రేవంత్‌తో పాటు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, వేలాది మంది పార్టీ నేతలు, కార్యకర్తలతో దీక్షలో పాల్గొన్నారు. ఈరోజు రాత్రి రేవంత్ మూడుచింతలపల్లిలోనే బస చేయనున్నారు. రేపు సాయంత్రం 5 గంటల వరకు దీక్ష కొనసాగనుంది. అనంతరం రేవంత్ ప్రజలనుద్దేశించి రచ్చబండ నిర్వహించనున్నారు.
ఇదీ చదవండి:Congress Meeting: నేటి నుంచే మూడు చింతలపల్లిలో కాంగ్రెస్ రెండు రోజుల దీక్ష