తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఈ నెల 15 నుంచి రేషన్​కార్డుదారులకు కిలో కందిపప్పు' - ration rice

మేడ్చల్​ మల్కాజిగిరి జిల్లాలో ఈ నెల 15నుంచి రేషన్​ కార్డుదారులకు ఉచితంగా కిలో కందిపప్పు ఇవ్వనున్నట్లు కలెక్టర్​ తెలిపారు. రేషన్​ డీలర్లు తగిన ఏర్పాట్లు చేయాలని కోరారు.

toor dal to ration card holders in medchal district
'ఈ నెల 15 నుంచి రేషన్​కార్డుదారులకు కిలో కందిపప్పు'

By

Published : May 13, 2020, 7:39 PM IST

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలకనుగుణంగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని అన్ని రేషన్ దుకాణాల్లో ఈనెల 15 నుంచి అర్హులైన ప్రతి రేషన్​ కార్డుదారునికి ఒక కిలో చొప్పున కందిపప్పును ఉచితంగా ఇవ్వనున్నట్లు జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు తెలిపారు. రేషన్ కార్డుదారులు తొందర పడకుండా, ఒక క్రమపద్ధతిలో స్వీయ నియంత్రణ పాటిస్తూ, మాస్కులు ధరించి కందిపప్పు పొందాలని కోరారు.

రేషన్​ డీలర్లు కూడా తగిన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్​ తెలిపారు. జిల్లా పౌరసరఫరాల అధికారి, సహాయ అధికారులు, తహసీల్దార్లు తగు శ్రద్ధ తీసుకోవాల్సిందిగా ఆదేశించారు.

ఇవీ చూడండి: పారిశుద్ధ్య కార్మికులకు తరచూ వైద్య పరీక్షలు: కేటీఆర్​

ABOUT THE AUTHOR

...view details