రూ. 1.10 కోట్లు ఎక్కడ నుంచి తెచ్చారనే విషయంపై ఆరా..! - కీసర కేసు వార్తలు
10:11 August 25
రూ. 1.10 కోట్లు ఎక్కడ నుంచి తెచ్చారనే విషయంపై ఆరా..!
మేడ్చల్ జిల్లా కీసర తహసీల్దార్ లంచం కేసులో నిందితులను అనిశా అధికారులు విచారిస్తున్నారు. నాంపల్లిలోని అవినీతి నిరోధక శాఖ కార్యాలయంలో విచారణ జరుగుతోంది. అంజిరెడ్డి, శ్రీనాథ్‌కు డబ్బులు ఎక్కడ్నుంచి వచ్చాయని అధికారులు ప్రశ్నిస్తున్నారు. రూ. కోటి 10 లక్షలు ఎక్కడ నుంచి తెచ్చారనే విషయంపై అనిశా అధికారులు ఆరా తీస్తున్నారు. తహసీల్దార్ నాగరాజు వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణంలో ప్రశ్నలు సంధిస్తున్నారు.