ఈ యువత వలస కార్మికుల మోమున చిరునవ్వు నింపుతోంది! - కరోనా
కరోనా మనిషి జీవితాన్ని అతలాకుతలం చేస్తోంది. వసల కూలీల బతుకు మరింత దుర్భరంగా మారింది. ఈ తరుణంలో ఎందరో సహృదయులు మేమున్నామంటూ ముందుకొస్తున్నారు. ఎవరికి తోచిన మేరకు వారు సాయం అందిస్తున్నారు. ఆ సేవలో తామూ ముందుంటామని చాటుతోంది అఖండ భారత యూత్ ఆర్గనైజేషన్.

akhanda bharath youth organization helping program latest news
కరోనాను కట్టిడి చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ ప్రకటించాయి. ఫలితంగా పొట్టకూటి కోసం ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ఎందరి జీవితాలో స్తంభించాయి. హైదరాబాద్లోని ఉప్పల్ నియోజకవర్గంలోని మేడిపల్లిలో ఇలా రెండు వందల మంది వలస కూలీలు ఆకలితో అలమటిస్తున్నారు. అప్పుడే మేమున్నామంటూ ముందుకొచ్చింది అఖండ భారత యూత్ ఆర్గనైజేషన్. వారికి నిత్యావసరాలు అందిస్తూ.. అండగా నిలుస్తోంది.
ఈ యువత వలస కార్మికుల మోమున చిరునవ్వు నింపుతోంది!