ఓ ఇంట్లో చోరీ జరిగిన ఘటన జీడిమెట్లలో జరిగింది. మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పరిధి ఎస్ఆర్ నాయక్ నగర్‌కు చెందిన రాజాసింగ్ మున్సిపల్ సూపర్వైజర్గా ఉద్యోగం చేస్తున్నాడు. వారం క్రితం తన బంధువు చనిపోవడం వల్ల కుటుంబసభ్యులతో కలిసి చేవెళ్ల వెళ్లారు. గమనించిన దొంగలు ఇంటి తాళాలు పగులగొట్టి చొరబడ్డారు. నేడు ఉదయం ఆ ప్రాంతంలో రోడ్లు ఊడ్చే మహిళలు వారి ఇంటి ముందు చెట్లు ఉన్నాయని కూర్చొని ఆ డోర్ వైపు చూడగా తాళం బయట ఉన్న మంచంపై పెట్టి ఉండడాన్ని గమనించి స్థానికులకు తెలపడం వల్ల పోలీసులకు సమాచారం అందించారు.
తాళం వేసిన ఓ ఇంట్లో చోరీ - crime news
తాళం వేసిన ఇంట్లో చోరీ జరిగిన ఘటన మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పరిధిలో చోటుచేసుకుంది. రాజాసింగ్ అనే వ్యక్తి తన బంధువు చనిపోవడం వల్ల ఇంటికి తాళం వేసి చేవెళ్లకు వెళ్లారు. గమనించిన దొంగలు తాళం పగులగొట్టి చోరీకి పాల్పడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసకుని దర్యాప్తు చేపట్టారు.
తాళం వేసిన ఓ ఇంట్లో చోరీ
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్లూస్‌టీం సాయంతో పరిశీలిస్తున్నారు. స్థానికులు ఇంటి యజమానికి తెలపడం వల్ల ఇంటికి చేరుకున్న రాజాసింగ్.. ఇంట్లో ఉన్న 5 లక్షల నగదును ఎత్తుకుపోయినట్లు వెల్లడించారు. ఇంట్లో ఉన్న సామాన్లను పూర్తిగా చిందరవందరగా పడేశారు దొంగలు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇవీ చూడండి: పోలీసులకు పట్టించాడని వెంటాడి మరీ చంపేశాడు...