తెలంగాణ

telangana

ETV Bharat / state

లిఫ్ట్‌ గుంతలో పడి యువతి దుర్మరణం - నిజాంపేట తాజా వార్తలు

ప్రమాదవశాత్తు లిఫ్ట్ గుంతలో పడి యువతి మృతి చెందిన ఘటన మేడ్చల్ జిల్లా బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. యువతి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని.. దర్యాప్తు చేపట్టారు.

లిఫ్ట్‌ గుంతలో పడి యువతి దుర్మరణం
లిఫ్ట్‌ గుంతలో పడి యువతి దుర్మరణం

By

Published : Aug 26, 2020, 8:05 AM IST

హైదరాబాద్ చాంద్రాయణగుట్టకు చెందిన రేణుక (22 సంవత్సరాలు) ఆమె తన సోదరుడి వద్ద నిజాంపేట రాజీవ్ గృహకల్పలో నివాసముంటూ ఇళ్లల్లో పనిచేస్తూ ఉండేది. మేడ్చల్‌ జిల్లా నిజాంపేట్ ప్రశాంతి హిల్స్ లోని ఆర్కేడ్ అపార్ట్మెంట్లో సోమవారం పని నిమిత్తం వెళ్లి అనంతరం ఇంటికి వచ్చే క్రమంలో సాయంత్రం ఆరున్నర గంటలకు లిఫ్ట్ గుంతలో పడి పోయింది.

స్థానికులు గమనించి వెంటనే ఆసుపత్రికి తరలించారు. మళ్లీ అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం కూకట్‌పల్లిలోని మరో ఆస్పత్రికి తరలించారు. అయినా యువతి పరిస్థితి విషమించడం వల్ల చికిత్స పొందుతూ రాత్రి 8 గంటల సమయంలో మృతి చెందింది. ఈ విషయమై కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు.

ఇదీ చదవండి:ఈ సమావేశాల్లోనే అసెంబ్లీ ముందుకు.. కొత్త రెవెన్యూ చట్టం!

ABOUT THE AUTHOR

...view details