మేడ్చల్ జిల్లా బహదూర్పల్లి వద్ద రోడ్డు అధ్వానంగా మారింది. 2012లో జీడిమెట్ల నుంచి సారెగూడెం వరకు ప్రతిపాదించిన రేడియల్ రోడ్డు నిర్మాణ పనులకు సంబంధించి 8.5 కిలోమీటర్లకుగాను రూ. 69 కోట్ల 90 లక్షలతో టెండర్లు నిర్వహించి ఓ కాంట్రాక్టు సంస్థకు అప్పగించారు. నిబంధనల ప్రకారం వర్క్ ఆర్డర్లు జారీ చేసిన తేది నాటి నుంచి 18 నెలల లోపు ఈ పనులు పూర్తి చేయాల్సిన బాధ్యత ఆ సంస్థపై ఉంది. కానీ వర్క్ ఆర్డర్ ఇచ్చి దాదాపు 7 ఏళ్ళు గడుస్తున్నా రోడ్డు పనులు పూర్తికాకపోవడం వల్ల వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్డు పనులు పూర్తి చేయాలని కోరుతున్నారు.
అధ్వానంగా బహదూర్పల్లి రోడ్డు.. విస్తరణ ఎప్పటికి పూర్తయ్యేనో..! - road
నిత్యం వేల వాహనాల ప్రయాణం.. అది రాష్ట్ర రహదారి.. కానీ ఆ రోడ్డుపై ప్రయాణించడానికి జనం జగ్గుతున్నారు. మేడ్బల్లా జిల్లాలోని బహదూర్పల్లి వద్ద బాలానగర్ నుంచి మెదక్ వెళ్లే మార్గం గుంతల మయంగా మారింది. రోడ్డు విస్తరణ పనులు అర్ధాంతరంగా ఆగిపోయి ప్రజల కష్టాలు రెట్టింపయ్యాయి.
బహదూర్పల్లి రోడ్డు