తెలంగాణ

telangana

ETV Bharat / state

అనుమానాస్పద స్థితిలో యువకుడి ఆత్మహత్య - మేడ్చల్

ఘట్​కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువకుడు అనుమానాస్పదస్థితిలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

అనుమానాస్పద స్థితిలో యువకుడు ఆత్మహత్య

By

Published : Jul 31, 2019, 12:04 PM IST

Updated : Jul 31, 2019, 12:10 PM IST

మేడ్చల్ జిల్లా ఘట్​కేసర్ పరిధి అంకుషాపూర్‌లోని ఇటుక బట్టి వద్ద ప్రణయ్‌ అనే యువకుడు సూపర్‌వైజార్‌గా పని చేస్తున్నాడు. పని స్థలానికి దగ్గర్లోని గదిలో అతను ఉరి వేసుకున్నాడు. తోటి పని వాళ్లు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. మృతుడు యాదాద్రి జిల్లా బీబీనగర్‌ మండలం పడమటి సోమారం గ్రామానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు.

అనుమానాస్పద స్థితిలో యువకుడు ఆత్మహత్య
తన కొడుకును ఎవరో హత్య చేసి ఉరి వేశారని మృతుడి తల్లి ఆరోపిస్తోంది. అనుమానాస్పదమృతిగా కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వైద్య పరీక్షల నివేదిక ఆధారంగా విచారణ కొనసాగిస్తామని ఘట్‌కేసర్‌ సీఐ రఘవీర్‌రెడ్డి తెలిపారు.
Last Updated : Jul 31, 2019, 12:10 PM IST

ABOUT THE AUTHOR

...view details