తెలంగాణ

telangana

ETV Bharat / state

నిర్మానుష్యంగా మారిన ఎల్బీ స్టేడియం - latest news on The LB Stadium closed from the last 15 days in hyderabad

లాక్​డౌన్​ నేపథ్యంలో ఎల్బీ స్టేడియం గత కొన్ని రోజులుగా మూతపడింది. కరోనా దెబ్బతో మొట్టమొదటి సారిగా స్టేడియం ఇన్ని రోజులు మూతపడిందని రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఛైర్మన్ వెంకటేశ్వర రెడ్డి తెలిపారు.

The LB Stadium closed from the last 15 days in hyderabad
నిర్మానుష్యంగా మారిన ఎల్బీ స్టేడియం

By

Published : Apr 7, 2020, 11:01 AM IST

ఎప్పుడూ ఆటగాళ్లతో కళకళలాడే ఎల్బీ స్టేడియం.. కరోనా నేపథ్యంలో గత 15 రోజులుగా మూగబోయింది. మామూలు రోజుల్లోనూ క్రీడాకారులు, పిల్లల సందడితో హోరెత్తే ప్రధాన స్టేడియం, టేబుల్ టెన్నిస్, వివిధ క్రీడా మైదానాలు జనాలు లేక వెలవెలబోతున్నాయి. ఉదయం, సాయంత్రం క్రీడాకారులతో సందడిగా ఉండే ఆట స్థలాలు.. కరోనా వైరస్ దెబ్బకు నిర్మానుష్యమైపోయాయి. స్టేడియాలకు తాళాలు పడ్డాయి.

1960లో అప్పటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి ప్రారంభించిన ఈ ఎల్బీ స్టేడియం.. కరోనా దెబ్బతో మొట్టమొదటి సారిగా ఇన్ని రోజులు మూతపడిందని రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఛైర్మన్ వెంకటేశ్వర రెడ్డి తెలిపారు.

ఇదీ చూడండి:భారత్​కు ట్రంప్​ వార్నింగ్​- ప్రతీకారం తప్పదట!

ABOUT THE AUTHOR

...view details