మేడ్చల్ పట్టణం పదేళ్లుగా ప్రత్యేక అధికారుల పాలనలోనే కొనసాగింది. చివరి సారిగా పంచాయతీగా ఉన్నప్పుడు 2006లో ఎన్నికలు నిర్వహించారు. ఈ పాలకవర్గం గడువు ముగిసినా ఎన్నికలు నిర్వహించలేదు. రెండేళ్లు ప్రత్యేక అధికారుల పాలనలోనే ఉండిపోయింది.
2013లో నగర పంచాయతీగా ప్రభుత్వం మార్చింది. గ్రామానికి చెందిన పలువురు కోర్టులో పిటీషన్ దాఖలు చేయడం వల్ల ఎన్నికలు సాధ్య పడలేదు. 2018లో గిర్మాపుర్ గ్రామాన్ని కలిపి పురపాలికగా హోదా కల్పించారు. ఇప్పటి వరకు ప్రత్యేక అధికారుల పాలనలోనే కొనసాగుతూ వచ్చింది.