మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఉప్పల్‌లో పౌర సరఫరాల శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్ల నిరుపేద ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రభుత్వం అందిస్తున్న ఉచిత బియ్యం పంపిణీ జరగక తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఏప్రిల్ నెల ప్రారంభమై 3 రోజులు అవుతున్నా.. బియ్యం సరఫరా చేయడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఉచిత బియ్యం పంపిణీ జరగక ప్రజల ఇబ్బందులు - latest news on The difficulties of the people for not distributing free rice in uppal
ప్రభుత్వం అందిస్తున్న ఉచిత రేషన్ బియ్యం పంపిణీ జరగక ఉప్పల్ ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పంపిణీ జరిగేలా చూడాలని కోరుతున్నారు.
![ఉచిత బియ్యం పంపిణీ జరగక ప్రజల ఇబ్బందులు The difficulties of the people for not distributing free rice in uppal](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6643356-25-6643356-1585897408644.jpg)
ఉచిత బియ్యం పంపిణీ జరగక ప్రజల ఇబ్బందులు
బియ్యం ఎప్పుడు పంపిణీ చేస్తారని రేషన్ డీలర్‌ని అడిగితే.. నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారంటూ ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి.. బియ్యం పంపిణీ జరిగేలా చూడాలని కోరుతున్నారు.
ఉచిత బియ్యం పంపిణీ జరగక ప్రజల ఇబ్బందులు