తిరుమలగిరి పోలీస్‌స్టేషన్ పరిధిలోని వెంకటేశ్వర కాలనీలో విషాదం చోటుచేసుకుంది. బాలుడు ఆయుష్ కుమార్ (14)కు తల్లి అనితాదేవి ఉదయం నుంచి సెల్‌ఫోన్ ఇవ్వలేదు. మనస్తాపం చెందిన బాలుడు మధ్యాహ్నం రెండున్నర గంటల సమయంలో బెడ్రూమ్లోకి వెళ్లి లోపలి నుంచి గడియ పెట్టుకున్నాడు. అనంతరం చున్నితో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
ఒక్కడే కుమారుడు
ఎంతకూ తలుపు తీయకపోవడం వల్ల చుట్టుపక్కల వారి సాయంతో బలవంతంగా డోర్ ఓపెన్ చేసి చూడగా అప్పటికే బాలుడు చనిపోయి ఉన్నట్లు గుర్తించారు. బాలుని తండ్రి సంజయ్ ప్రకాష్ ఆర్మీలో సుబేదారుగా ఉత్తర్‌ప్రదేశ్‌లో విధులు నిర్వహిస్తున్నారు. సంజయ్‌కి ముగ్గురు పిల్లలు ఉండగా ఇద్దరు కూమార్తెలు, ఒక కుమారుడు.