మేడ్చల్ జిల్లాలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అధికార తెరాస షాక్ ఇచ్చింది. ఛైర్మన్ పదవిని దక్కించుకునేందుకు తెరాస ప్రయత్నం సఫలమైంది. పీర్జాదిగూడ నగరపాలక సంస్థ మేయర్ ఎంపిక ఉత్కంఠగా ముగిసింది. జవహర్‌నగర్ కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
మేడ్చల్ - ఛైర్మన్ ఎన్నిక వాయిదా
మేడ్చల్ మున్సిపాలిటీ ఛైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి కాంగ్రెస్ 4, భాజపా 1, స్వతంత్ర 1 మాత్రమే హాజరయ్యారు. తెరాస కౌన్సిలర్లు గైర్హాజరు కావడం వల్ల ఎన్నిక వాయిదా పడింది. గెలిచిన అభ్యర్థుల చేత ఎన్నికల ప్రత్యేక అధికారి అబ్దుల్ సత్తార్ ప్రమాణ స్వీకారం చేయించారు.
మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లాలోని మున్సిపాలిటీలు
- గుండ్ల పోచంపల్లి.. ఛైర్మన్ - మద్దుల లక్ష్మి, వైస్ ఛైర్మన్ - ప్రభాకర్.
- తూంకుంట.. ఛైర్మన్ - కారింగుల రాజేశ్వర్ రావు, వైస్ ఛైర్మన్ - పన్నాల భవాని.
- దమ్మాయిగూడ.. ఛైర్మన్ - వసుపతి ప్రణీత, వైస్ ఛైర్మన్ - నరేందర్ రెడ్డి మాదిరెడ్డి.
- దుండిగల్.. ఛైర్మన్ - సుంకరి కృష్ణవేణి, వైస్ ఛైర్మన్ - పద్మారావు.
- ఘట్ కేసర్.. ఛైర్మన్ - ఎం. పావని, వైస్ ఛైర్మన్ - పి. మాధవరెడ్డి
- నాగారం.. ఛైర్మన్ - కౌకుట్ల చంద్రారెడ్డి, వైస్ ఛైర్మన్ - బండారు మల్లేష్ యాదవ్.
- పోచారం.. ఛైర్మన్ - బోయపల్లి కొండల్ రెడ్డి, వైస్ ఛైర్మన్ - నానవత్ రెడ్యానాయక్
- కొంపల్లి.. ఛైర్మన్ - సన్న శ్రీశైలం యాదవ్, వైస్ ఛైర్మన్ - ఎన్నిక వాయిదా
- మేడ్చల్ ఎన్నిక వాయిదా
మేడ్చల్ - నగర పాలక సంస్థలు
- పిర్జాదిగూడ.. మేయర్-జక్క వెంకట్ రెడ్డి, డిప్యూటి మేయర్- కుర్ర శివకుమార్ గౌడ్.
- జవహర్ నగర్.. మేయర్-మేకల కావ్య, డిప్యూటి మేయర్- రెడ్డి శెట్టి శ్రీనివాస్.
- బోడుప్పల్.. మేయర్- సామల బుచ్చిరెడ్డి, డిప్యూటీ మేయర్- రాసాల వెంకటేష్ యాదవ్
- నిజాంపేట్.. మేయర్- కోలాన్ నీలా, డిప్యూటీ మేయర్- శనిగల ధన్ రాజ్ యాదవ్
ఇవీ చూడండి: కాంగ్రెస్, భాజపా కలిసినా.. కారు జోరు ఆగలేదు!