తెలంగాణా ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మేడ్చల్ జిల్లా కీసర మండల కేంద్రంలోని అమర వీరుల స్థూపానికి మంత్రి మల్లారెడ్డి, సైబరాబాద్ సీపీ సజ్జనార్ పూలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం మేడ్చల్ కలెక్టరేట్లో జాతీయ జెండాను మంత్రి ఆవిష్కరించారు.
మేడ్చల్ జిల్లాలో ఘనంగా రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు - మంత్రి మల్లారెడ్డి
మేడ్చల్ కలెక్టరేట్ ఆవరణలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ సంబురాలు అంబరాన్నంటాయి. ముందుగా కీసర చౌరస్తాలోని అమరవీరుల స్ధూపానికి మంత్రి మల్లారెడ్డి, సైబరాబాద్ సీపీ సజ్జనార్ అంజలి ఘటించారు.
మేడ్చల్ జిల్లాలో ఘనంగా రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు
కొవిడ్-19 దృష్ట్యా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని నిరాడంబరంగా చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.
ఇవీ చూడండి: జయహో తెలంగాణ.. అమరులకు సీఎం నివాళులు