జేఎన్టీయూకు(JNTUH Golden Jubilee Celebrations) దేశంలోనే మంచి పేరుందని గవర్నర్ తమిళిసై(Governor Tamilisai Soundararajan) ప్రశంసించారు. దేశంలోనే మొదటి టెక్నలాజికల్ యూనివర్సిటీ జేఎన్టీయూహెచ్ అని గవర్నర్ తెలిపారు. జేఎన్‌టీయూ(JNTU) హైదరాబాద్ స్వర్ణోత్సవాలను (JNTUH Golden Jubilee Celebrations) గవర్నర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా స్వర్ణోత్సవాల లోగోను ఆవిష్కరించారు.
ప్రస్తుతం ప్రతి ఒక్కటీ సాంకేతికపైనే ఆధారపడి ఉందని.. అందుకు అనుగుణంగా విద్యార్థులు అవకాశాలను అందిపుచ్చుకోవాలని సూచించారు. భారత్ నుంచి ఇతర దేశాలకు టీకాలు ఎగుమతి అవుతున్నాయంటే.. ఇలాంటి యూనివర్సిటీల నుంచి వెళ్లిన విద్యార్థుల కృషేనని గవర్నర్(Governor Tamilisai Soundararajan) కితాబిచ్చారు. ఈ యూనివర్సిటి పరిధిలో ఇప్పటి వరకూ 19 లక్షల మంది చదువుకున్నారన్న గవర్నర్.. పూర్వ విద్యార్థుల కోసం ప్రత్యేక కేంద్రం ఏర్పాటుచేస్తున్నట్లు తెలిపారు. పూర్వ విద్యార్థులు అంటే భావితరాల ఆస్తని.. వారిందరినీ ఏకం చేస్తే మరిన్ని విజయాలు సాధించవచ్చన్నారు.