రోమ్ నగరం తగలపడుతుంటే ఆ దేశ అధ్యక్షుడు ఫిడేల్ వాయించుకుంటూ కూర్చున్నట్టు.. ప్రజల సమస్యలు వదిలేసి సీఎం కేసీఆర్ ప్రగతి భవన్లో ఉల్లాసంగా, ఉత్సాహంగా గడుపుతున్నారని తెతెదేపా అధ్యక్షుడు ఎల్.రమణ ఎద్దేవా చేశారు. కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలని కోరుతూ కీసరలోని మేడ్చల్ జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ప్రజలు పడుతున్న అవస్థలు, బాధలను పట్టించుకోకపోవడం వల్ల తెలుగుదేశం రోడ్డెక్కి ఆందోళనలకు దిగిందని రమణ తెలిపారు. వెంటనే కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలని డిమాండ్ చేశారు.
కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలని తెదేపా ధర్నా - corona virus
కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలని డిమాండ్ చేస్తూ తెదేపా ఆధ్వర్యంలో మేడ్చల్ జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ప్రజలు అవస్థలు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని తెతెదేపా అధ్యక్షుడు ఎల్.రమణ విమర్శించారు.
అలాగే ప్రభుత్వ ఆసుపత్రుల్లో వసతులు మెరుగుపర్చి పేద ప్రజలను ఆదుకోవాలని కోరారు. కరోనా సోకిన ప్రజలకు, మీడియా ప్రతినిధులకు, పోలీసు, పారిశుద్ధ్య, వైద్య సిబ్బందికి నెలకు 7500 రూపాయల భృతి ఇవ్వాలని, కరోనాతో మృతిచెందిన వారికి 10 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రేటర్ కన్వీనర్ అరవింద్ కుమార్ గౌడ్, మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు కందికంటి అశోక్ కుమార్ గౌడ్, 300 మంది పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: 'ఈ నెల 30న ఇందిరాభవన్లో పీవీ విదేశీ విధానంపై చర్చ'