తెలంగాణ

telangana

ETV Bharat / state

'భాగ్యనగరం తెదేపా హయాంలోనే అభివృద్ధి చెందింది' - పురపోరు

తెదేపా హయంలోనే భాగ్యనగరం అభివృద్ధిలో దూసుకెళ్లిందని తెతెదేపా అధ్యక్షుడు ఎల్​.రమణ పేర్కొన్నారు. పుర ఎన్నికల్లో తెదేపా అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.

tdp muncipal elections compaign
'భాగ్యనగరం తెదేపా హయాంలోనే అభివృద్ధి చెందింది'

By

Published : Jan 20, 2020, 7:49 AM IST

హైదరాబాద్​కు ప్రపంచంలో గుర్తింపు వచ్చింది తెదేపా హయాంలోనేనని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ అన్నారు. పుర ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజాంపేట్​లో నిర్వహించిన రోడ్ షోలో ఆయన పాల్గొన్నారు. సాఫ్ట్​వేర్​ రంగం హైదరాబాద్​కు రావడం వల్ల నగర శివారు ప్రాంతాలు అభివృద్ధి చెందాయని ఆయన అన్నారు .

తాగునీటి సమస్య పరిష్కారం కావాలన్నా , రహదారుల నిర్మాణం పూర్తి అవ్వాలన్న తెదేపా వల్లనే సాధ్యమవుతుందన్నారు. తెలుగుదేశం అభ్యర్థులను గెలిపించి అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఓటర్లను అభ్యర్థించారు.

'భాగ్యనగరం తెదేపా హయాంలోనే అభివృద్ధి చెందింది'

ఇవీ చూడండి: నేటి సాయంత్రంతో పురప్రచారం పరిసమాప్తం

ABOUT THE AUTHOR

...view details