తెలంగాణ

telangana

ETV Bharat / state

పరిటాల రవి వర్ధంతి సందర్భంగా రక్తదాన శిబిరం! - నిజాంపేటలో పరిటాల వర్ధంతి సందర్భంగా రక్తదాన శిబిరం

తెదేపా నేత పరిటాల రవి వర్ధంతిని నిజాంపేట మున్సిపల్​ కార్పొరేషన్​ పరిధిలో నిర్వహించారు. పరిటాల రవి అసోసియేషన్​ శివరాం మిత్రమండలి ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేపట్టారు. రక్తదాన శిబిరంతో పాటు, అన్నదానం చేపట్టారు.

blood donation camp, paritala ravi death day
పరిటాల రవి వర్ధంతి, రక్తదాన శిబిరం

By

Published : Jan 24, 2021, 5:15 PM IST

తెలుగుదేశం పార్టీ నేత పరిటాల రవి 16వ వర్ధంతిని మేడ్చల్​ జిల్లా నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఆదివారం నిర్వహించారు. పరిటాల రవి అసోసియేషన్ శివరాం మిత్రమండలి ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేపట్టారు.

ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. పరిటాల రవి అభిమానులు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున శిబిరంలో పాల్గొని రక్తదానం చేశారు. అనంతరం మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

ఇదీ చదవండి:తహసీల్దార్‌ కార్యాలయాల్లో పని విభజన చేయాలి: కిషన్‌రెడ్డి

ABOUT THE AUTHOR

...view details