మేడ్చల్ జిల్లా సూరారం కాలనీలోని అట్టల పరిశ్రమలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. నివాసాల మధ్య ఓ వ్యక్తి ఇంట్లో కుటుంబ పరిశ్రమగా అట్టల పెట్టెలు (ప్యాకింగ్) తయారు చేస్తున్నాడు. రాత్రి 8 గంటల సమయంలో ఇంట్లో నుంచి పొగలు రావడం గమనించిన స్థానికులు ఫైర్ స్టేషన్కు సమాచారం అందించారు. మరికొంతమంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు కృషి చేశారు. అయినా మంటలు తీవ్రమయ్యాయి. ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఇంటి ఆవరణలో ఉంచిన టాటా ఏస్ వాహనం దగ్ధమయింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.
అట్టల పరిశ్రమలో.... అగ్నిప్రమాదం - సూరారం కాలనీ
మేడ్చల్ జిల్లా సురారం కాలనీలోని అట్టల పరిశ్రమలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.
అట్టల పరిశ్రమలో.... అగ్నిప్రమాదం
Last Updated : Jul 13, 2019, 7:35 AM IST