మందు దొరకడం లేదని ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. మేడ్చల్ జిల్లా చింతల్కి చెందిన ఉగ్గిన శ్రీను సెంట్రింగ్ పనిచేసేవాడు. క్రమక్రమంగా తాగుడుకు బానిసయ్యాడు. దేశం మొత్తం లాక్డౌన్ ఉన్నందున మద్యం దుకాణాలు మూసేవేశారు. శ్రీను తనకు తెలిసిన బెల్ట్ దుకాణాలకు వెళ్లినా ఫలితం లేకపోయింది.
మద్యం దొరకలేదని ఆత్మహత్య - medchal district latest news
ఓ వ్యక్తికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు.. కానీ తానూ మద్యం తాగకుండా ఉండలేడు. లాక్డౌన్ నేపథ్యంలో మద్యం దొరకడం లేదని ఆత్మహత్య చేసుకున్న ఘటన బాలానగర్ పరిధిలో చోటుచేసుకుంది.

మద్యం దొరకలేదని ఆత్మహత్య
చివరకు తన భార్యతో కలిసి ఐడీపీఎల్ ఎన్టీఆర్ నగర్లోని ఓ బెల్ట్ దుకాణానికి వెళ్లాడు. అక్కడ కూడా మద్యం దొరకలేదు. ఆవేదనతో భార్యకు తెలియకుండా అదృశ్యమయ్యాడు. ఆచూకీ కోసం చుట్టుపక్కల, బంధువులను ఆరా తీశారు. అయినా అతని జాడ తెలియలేదు. కుటుంబ సభ్యులు జీడీమెట్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. చివరకు ఐడీపీఎల్ అటవీ ప్రాంతంలో ఉరివేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఇదీ చూడండి :బాధ్యతగా కల్లుతాగడమంటే ఇదేనేమో..