తెలంగాణ

telangana

ETV Bharat / state

ఇండోర్​ స్టేడియం ప్రారంభం కోసం జేఎన్టీయూలో ధర్నా - abvp

జేఎన్టీయూ విశ్వవిద్యాలయంలో నిర్మించిన ఇండోర్​ క్రీడా ప్రాంగణాన్ని వెంటనే విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని విద్యార్థి సంఘాలు ధర్నా నిర్వహించాయి. ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు పరిపాలనా​​ భవనం ముందు నిరసన తెలిపి ఉపకులపతికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఇండోర్​ స్టేడియం ప్రారంభించాలంటూ జేఎన్టీయూలో విద్యార్థుల ధర్నా

By

Published : Aug 23, 2019, 6:53 PM IST

హైదరాబాద్​లోని జేఎన్టీయూ విశ్వవిద్యాలయంలో నిర్మించిన ఇండోర్​ స్టేడియాన్ని తక్షణమే అందుబాటులోకి తీసుకురావాలంటూ ఏబీవీపీ ఆధ్వర్యంలో ర్యాలీ చేశారు. విద్యార్థులు భారీ ర్యాలీగా వచ్చి పరిపాలనా భవనం ప్రధాన ద్వారం వద్ద బైఠాయించారు. జులై 18న విద్యా శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి అట్టహాసంగా ప్రారంభించిన ఇండోర్ స్టేడియం ఇప్పటివరకు అందుబాటులోకి తీసుకురాలేదని ఆరోపించారు. 13 కోట్లు వ్యయంతో నిర్మించిన ఇండోర్ స్టేడియం విద్యార్థులకు ఉపయోగపడకపోవడం ఏంటని ప్రశ్నించారు. ఉపకులపతి, రిజిస్ట్రార్ల పదవీకాలం ముగుస్తుందని వారి పేర్లు శిలాఫలకాలపై వేసుకునేందుకే ఈ తొందరపాటు చర్యని ఆరోపించారు.

ఇండోర్​ స్టేడియం ప్రారంభించాలంటూ జేఎన్టీయూ విద్యార్థుల ధర్నా
ఇదీ చూడండి: భద్రత కల్పించాలంటూ ఓయూ విద్యార్థినుల ధర్నా

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details