తెలంగాణ

telangana

ETV Bharat / state

విద్యార్థిని ఆత్మహత్య - suicide

అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురికి ఏకష్టమొచ్చిందో తెలియదు.. తల్లదండ్రులకు విషాదాన్ని మిగిల్చి విగతజీవిగా మారింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన మేడ్చల్ జిల్లాలో చోటు చేసుకుంది.

విద్యార్థిని ఆత్మహత్య..

By

Published : Mar 7, 2019, 5:27 AM IST

Updated : Mar 7, 2019, 8:48 AM IST

విద్యార్థిని ఆత్మహత్య..

మేడ్చల్​జిల్లా ఘట్​కేసర్​లో దారుణం జరిగింది. ఉదయం ఇంటర్మీడియట్​ పరీక్ష రాసొచ్చిన ఓ విద్యార్థిని సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో చున్నీతో ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలు హబ్సిగూడలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్‌ రెండో సంవత్సరం చదువుతోంది. ఘటనా స్థలిని పరిశీలించిన పోలీసులు పరీక్ష సరిగా రాయలేదని మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడిందా... లేదా ఇంకేమైనా కారణాలున్నాయనే కోణంలో దర్యప్తు చేస్తున్నారు.

Last Updated : Mar 7, 2019, 8:48 AM IST

ABOUT THE AUTHOR

...view details