మేడ్చల్ జిల్లా కొంపల్లిలోని ఎన్సీఎల్ కాలనీలో ఓ వీధి కుక్క స్వైరవిహారం చేసింది. మంగళవారం సాయంత్రం.. ఇంటి ముందు ఆడుకుంటోన్న ప్రణీత్‌రెడ్డి(10)పై దాడి చేసి నుదుటి, నోటి భాగాలను తీవ్రంగా గాయపర్చింది.
వీధికుక్క స్వైరవిహారం.. విద్యార్థికి తీవ్ర గాయాలు - వీధికుక్క స్వైరవిహారం
మేడ్చల్ జిల్లాలో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. కొంపల్లిలోని ఓ బాలుడిపై వీధి కుక్క దాడి చేసి తీవ్రంగా గాయపర్చిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
![వీధికుక్క స్వైరవిహారం.. విద్యార్థికి తీవ్ర గాయాలు street-dog-attacked-a-boy-playing-in-front-of-the-house-in-medchal-malkajgiri](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11149730-269-11149730-1616652099919.jpg)
వీధికుక్క స్వైరవిహారం.. విద్యార్థికి తీవ్ర గాయాలు
కుటుంబసభ్యులు.. బాలుడిని ఆస్పత్రికి తరలించి ప్లాస్టిక్ సర్జరీ చేయించారు. గత నెలలో అదే కాలనీకి చెందిన మరో ముగ్గురు చిన్నారులనూ.. వీధి కుక్కలు గాయపరిచాయని స్థానికులు తెలిపారు. శునకాలు.. తమ ప్రాంతంలో విచ్చల విడిగా తిరుగుతూ తమను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ అధికారులు ఈ విషయంపై దృష్టి సారించి వీధి కుక్కల బారి నుంచి రక్షించాలని కాలనీ వాసులు కోరుతున్నారు.
ప్లాస్టిక్ సర్జరీ అనంతరం..
Last Updated : Mar 25, 2021, 11:42 AM IST