న్యాయస్థానాల పట్ల ప్రజలకు గౌరవం పెరిగేలా అవగాహన కల్పించాలని రాష్ట్ర మానవ హక్కుల సంఘం ఛైర్మన్ జస్టిస్ చంద్రయ్య అన్నారు. మేడ్చల్ పట్టణంలోని కోర్టును సందర్శించిన ఆయన... బార్ కౌన్సిల్ సభ్యులతో సమావేశమయ్యారు.
'కోర్టుల పట్ల ప్రజలకు గౌరవం పెరిగేలా అవగాహన కల్పించాలి' - justice chandrayya visit madchal court
మేడ్చల్ పట్టణంలోని కోర్టును రాష్ట్ర మానవ హక్కుల సంఘం ఛైర్మన్ జస్టిస్ చంద్రయ్య సందర్శించారు. ఈ సందర్భంగా బార్ కౌన్సిల్ సభ్యులతో సమావేశం అయ్యారు. మానవ హక్కులపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.
'కోర్టుల పట్ల ప్రజలకు గౌరవం పెరిగేలా అవగాహన కల్పించాలి'
పౌరులకు హక్కులు కాపాడే విధంగా కమిషన్ పనిచేయాలని సూచించారు. ఆయన వెంట మేడ్చల్ జిల్లా సీనియర్ జడ్జి వరూధిని, జూనియర్ సివిల్ జడ్జి అరుణ, 21 ఎంఎం కోర్టు సౌజన్య, 22 ఎంఎం కోర్టు జడ్జి నాగరాజు, బార్ ఆసోసియేషన్ ప్రెసిడెంట్ శివకుమార్ తదితరులు ఉన్నారు.
ఇదీ చూడండి:ఇదెక్కడి సమస్య.... ట్యాంకు కట్టారని సంతోషపడాలా.. నిర్లక్ష్యం చూసి బాధపడాలా!
TAGGED:
madchal district latest news