తెలంగాణ

telangana

ETV Bharat / state

Sri Nidhi Engineering College Controversy : శ్రీనిధి కాలేజీలో మరోసారి ఉద్రిక్తత.. సెక్యూరిటీ, ఏబీవీపీ నాయకుల మధ్య ఘర్షణ - Clash at Srinidhi University Viral Video

Sri Nidhi Engineering College Controversy : మేడ్చల్​ జిల్లా ఘట్​కేసర్​లోని శ్రీనిధి ఇంజినీరింగ్​ కళాశాలలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇద్దరు విద్యార్థుల హాజరు విషయంపై మాట్లాడేందుకు ఏబీవీపీ నాయకులు కాలేజీ వద్దకు వెళ్లగా.. సెక్యూరిటీ సిబ్బందితో ఘర్షణకు దిగారు. దీంతో మరోసారి కళాశాల వద్ద తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.

ABVP Leaders Attack on Sri Nidhi College
Sri Nidhi Engineering College Controversy

By ETV Bharat Telangana Team

Published : Sep 4, 2023, 3:16 PM IST

Updated : Sep 4, 2023, 4:26 PM IST

Sri Nidhi Engineering College Controversy శ్రీనిధి కాలేజీలో మరోసారి ఉద్రిక్తత.. సెక్యూరిటీ, ఏబీవీపీ నాయకుల మధ్య వాగ్వాదం

ABVP Leaders Attack on Sri Nidhi College : మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్ (Ghatkesar) యనంపేటలో శ్రీనిధి ఇంజినీరింగ్ కళాశాలలో మరోసారి ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. విద్యార్థుల హాజరు విషయమై రాష్ట్ర ఏబీవీపీ నాయకులు కాలేజీకి వెళ్లగా.. కళాశాల సెక్యూరిటీ సిబ్బందితో మరోసారి వాగ్వాదానికి దిగారు. దీంతో ఏబీవీపీ నాయకులు, సెక్యూరిటీ సిబ్బంది మధ్య ఘర్షణ తలెత్తి ఒకరిపై ఒకరు దాడులు చేసుకునే పరిస్థితికి వచ్చింది.

Clash at Srinidhi University Viral Video :దీంతో ఏబీవీపీ కార్యకర్తలు (ABVP leaders protest) కాలేజీ ఫర్నీచర్‌ ధ్వంసం చేసి సెక్యూరిటీ సిబ్బందిపై దాడికి పాల్పడ్డారు. దీంతో కాలేజీ ఆవరణంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గతంలోనూ కాలేజీ వద్ద ఏబీవీపీ నాయకుల ధర్నా ఉద్రిక్తతకు దారితీసింది. గత నెల 31వ తేదీన జరిగిన దాడికి ప్రతిదాడిగా ఇవాళ మరోసారి వివాదం తలెత్తినట్లు తెలుస్తోంది.

Clash at Srinidhi University Viral Video : ఏబీవీపీ నేతలు, శ్రీనిధి కళాశాల సెక్యూరిటీ సిబ్బంది డిష్యుం.. డిష్యుం.. వీడియో వైరల్

హైదరాబాద్ శివారు ఘట్​కేసర్ మండలంలో ఉన్న శ్రీ నిధి విశ్వవిద్యాలయం వద్ద వివాదాలు కొత్త కాదు. వర్సిటీకి అనుమతి రాకముందే తప్పుడు సమాచారంతో విద్యార్థులకు అడ్మిషన్లు ఇచ్చి.. తరగతులు నిర్వహిస్తున్నారంటూ.. గత కొన్నిరోజులుగా విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనలు చేస్తున్నారు. యాజమాన్యం తీరుతో సుమారు 290 మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందంటూ తల్లిదండ్రులతో పాటు విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ క్రమంలోనే గతంలో అనేక సార్లు వర్సిటీ వద్ద ఆందోళనలు చేశారు.

Srinidhi University Controversy :జులై 31వ తేదీన విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద ఎత్తున ఆందోళన చేసి కాలేజీ ఫర్నీచర్​, అద్దాలను ధ్వసం చేశారు. దీంతో కళాశాల యాజమాన్యం దిగొచ్చి.. ఆగస్టు 15 వరకు గడువు కోరింది. విద్యార్థులను వేరే కళాశాలకు బదిలీ చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళనలు విరమించారు. అనంతరం యాజమాన్యం ఇచ్చిన గడువు ముగిసిన.. విద్యార్థులను కళాశాలకు బదిలీ చేయకపోవటంతో తల్లిదండ్రులు మరోసారి ఆందోళనకు దిగారు. దీంతో బాధితులకు మద్దతుగా విద్యార్థి సంఘాల నాయకులు మద్దతు పలికారు.

Protests at Srinidhi University : శ్రీనిధి యూనివర్సిటీ వద్ద తీవ్ర ఉద్రిక్తత.. మరోసారి విద్యార్థులు, తల్లిదండ్రుల ఆందోళన

ఈ క్రమంలోనే ఆగస్టు 31వ తేదీన మరోసారి కాళాశాల వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. సెక్యూరిటీ సిబ్బంది, ఏబీవీపీ నాయకుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. అనంతరం ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కాలేజీ వద్దకు చేరుకొని పలువురిని అదుపులోకి తీసుకున్నారు. శ్రీనిధి కాలేజీ భద్రతా సిబ్బంది, ఏబీవీపీ నేతలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. ఈ క్రమంలోనే ఇవాళ మరోసారి ఏబీవీపీ నాయకులు కాలేజీ వద్దకు వెళ్లారు. ఆగస్టు 31న జరిగిన దాడికి నిరసనగా కాలేజీలో ప్రతిదాడి జరినట్లు తెలుస్తోంది.

Sreenidhi University Students Protest : శ్రీనిధి వర్సిటీలో నెలకొన్న ప్రతిష్ఠంబన.. ఆందోళనలో విద్యార్థులు, తల్లిదండ్రులు

Jagtial Deepthi Murder Case Update : సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ దీప్తి మర్డర్​ కేసు.. పోలీసుల అదుపులో చందన..?

Last Updated : Sep 4, 2023, 4:26 PM IST

ABOUT THE AUTHOR

...view details