లోక కల్యాణార్థం మేడ్చల్ జిల్లా కీసర మండలం దమ్మాయిగూడలోని కనకదుర్గాదేవి ఆలయంలో శ్రీ మహాలక్ష్మి కుబేర యాగం ఘనంగా జరిగింది. ఈ వేడుకకు పెద్ద సంఖ్యలో మహిళా భక్తులు పూజలు చేశారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలనే.. ఈ యాగం తలపెట్టామని ఆధ్యాత్మిక సేవా కార్యకర్తలు తెలిపారు. ఆదివారం కూడా యాగం కొనసాగుతుందని.. అనంతరం అన్నదాన వితరణ ఉంటుందని పండితులు తెలిపారు.
కీసరలో శ్రీ కనకమహాలక్ష్మి కుబేర యాగం - దమ్మాయిగూడ
మేడ్చల్ జిల్లా కీసర మండలం దమ్మాయిగూడలోని కనకదుర్గా దేవి ఆలయంలో శ్రీ మహాలక్ష్మి కుబేర యాగం ఘనంగా నిర్వహించారు. శ్రీ సాయివాణి ఆధ్యాత్మిక సేవా కేంద్రం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
మేడ్చల్జిల్లా కీసరలో శ్రీ కనకమహాలక్ష్మి కుబేర యాగం