అత్యధిక లాభాలు పొందడానికి ఏకైక మార్గం శ్రీగంధం మొక్కలు పెంచడమే అని జీవవైవిధ్య శాస్త్రవేత్త జీఆర్‌ఎస్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో శ్రీగంధం మొక్కలు పెంచే రైతులు, ఆసక్తి ఉన్నవారికి మేడ్చల్ జిల్లా దూలపల్లిలోని భారత జీవవైవిధ్య సంస్థ ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి వచ్చిన సుమారు 50 మంది రైతులకు శ్రీగంధం పెంపకం, సాగు పద్ధతులు, మార్కెటింగ్, ఇతర అంశాలపై అవగాహన కల్పించారు.
ఎలా సాగు చేయాలి?
శ్రీగంధం మొక్కలు ఎలా పెంచాలి, వాటికి వచ్చే రోగాలు ఏంటి, రైతులు కొత్త పద్ధతులను ఉపయోగించి ఈ మొక్కల ద్వారా ఏ విధంగా లాభాలు పొందుతారో వివరించినట్లు జీఆర్‌ఎస్ రెడ్డి తెలిపారు. ఈ మొక్కలకు ప్రభుత్వం బీమా సౌకర్యం కల్పిస్తే రైతులు మరింత లాభం పొందవచ్చని తెలిపారు.
అనుభవాల మార్పిడి