తెలంగాణ

telangana

ETV Bharat / state

సాఫ్ట్‌వేర్​ ఇంజినీర్ ఇంటికి రాలేదు.. భయంతో భార్య ఫిర్యాదు - సాఫ్ట్‌వేర్​ ఉద్యోగి మిస్సింగ్​

సాఫ్ట్‌వేర్​ ఉద్యోగానికి ఉదయం వెళ్లాడు.. సాయంత్రం తిరిగి రాలేదు. భార్య ఫోన్​ చేస్తే దోస్త్ ఇంటికి వెళ్తున్నానని చెప్పాడు. అయినా రాకపోయే సరికి భార్య భయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన ఘట్‌కేసర్‌ పోలీస్​స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది.

Software husband did not come wife complained at ghatkesar police at medchal district
సాఫ్ట్‌వేర్​ భర్త రాలేదు.. భయంతో భార్య ఫిర్యాదు

By

Published : Mar 4, 2020, 10:06 PM IST

మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా ఘట్‌కేసర్‌ పోలీస్​స్టేషన్‌ పరిధిలో డ్యూటీకి వెళ్లిన ఓ సాఫ్ట్‌వేర్​ ఉద్యోగి కనిపించకుండా పోయాడు. అన్నోజిగూడలోని నివాసముంటున్న అంజూరి అశోక్‌కుమార్‌ ఆదిభట్లలోని టీసీఎస్‌ సంస్థలో పని చేస్తున్నాడు. ఈనెల 3న ఉదయం 8 గంటలకు డ్యూటీకి వెళ్తుతున్నానని భార్య కల్యాణితో చెప్పి వెళ్లాడు. కానీ రాత్రి పదిన్నర వరకు రాకపోవడం వల్ల భార్య ఫోన్‌ చేసింది.

స్నేహితుడి ఇంటికి వెళ్తుతున్నానని, ఉదయం వస్తానని చెప్పాడు. అయినా ఇంటికి రాకపోవడం వల్ల పలుమార్లు ఫోన్‌ చేసింది. చరవాణి స్విచ్‌ఆఫ్‌ అని వచ్చింది. భయందోళనకు గురైన భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. అదృశ్యం కేసు నమోదు చేసిన పోలీసులు ప్రత్యేక బృందాల ద్వారా దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

సాఫ్ట్‌వేర్​ భర్త రాలేదు.. భయంతో భార్య ఫిర్యాదు

ఇదీ చూడండి :ఇళ్లలోకి వెళ్లడు.. కానీ దొంగతనం చేస్తాడు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details