రాష్ట్రవ్యాప్తంగా ఆరో విడత హరితహారం కార్యక్రమం ఈనెల 20 నుంచి ప్రారంభమవుతుందని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. దీనిపై ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యయనం చేశారని... రాష్ట్రంలో ఎన్ని మొక్కలు అందుబాటులో ఉన్నాయో అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారని వెల్లడించారు. అటవీశాఖ వద్ద మూడున్నర కోట్ల మొక్కలు అందుబాటులో ఉన్నాయని మంత్రి తెలిపారు.
'హరితహారం-6లో చింతచెట్ల పెంపకంపై ప్రధానంగా దృష్టి' - హరితహారం మొక్కల పెంపకం - తాజా వివరాలు
రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 20 నుంచి ఆరో విడత హరితహారం కార్యక్రమం ప్రారంభమవుతుందని అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ఈ మేరకు 3.5కోట్ల మొక్కలు అటవీశాఖ వద్ద అందుబాటులో ఉన్నాయి. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఈ ఏడాది చింత చెట్ల పెంపకంపై ప్రత్యేక దృష్టి సారించామని మంత్రి వివరించారు.
ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు చింతపండును ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకోకుండా... ఈ ఏడాది కోటి చింత మొక్కలు ప్రత్యేకంగా నాటనున్నట్లు పేర్కొన్నారు. అలాగే కోతుల బెడదను తప్పించుకునేందుకు మరో నెల రోజుల్లో నిర్మల్‌లో నూతనంగా కోతుల పరిరక్షణ కేంద్రాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. దీని కోసం హిమాచల్‌ప్రదేశ్‌లో ఉన్న కోతుల పరిరక్షణ కేంద్రాన్ని రాష్ట్ర అధికారుల బృందం అధ్యయనం చేసిందని వివరించారు. బౌరంపేటలోని ఓ కార్యక్రమానికి హాజరైన మంత్రి... ఈ వివరాలను వెల్లడించారు.
ఇదీ చూడండి :ఆదిలాబాద్‌లో గ్యాంగ్‌వార్.. పరారీలో తెరాస కౌన్సిలర్