గ్రేటర్ హైదరాబాద్లో కరోనా వైరస్ అత్యధికంగా విజృంభిస్తోంది. ఈ తరుణంలో స్వతహాగా సెల్ఫ్ లాక్డౌన్ చేసేందుకు కుత్బుల్లాపూర్ పరిధిలోని దుకాణదారులు ముందుకొచ్చారు. జూన్ 28వ తేది నుంచి ఈ నెల 5 వరకు సెల్ఫ్ లాక్డౌన్ ప్రకటించి దుకాణాలు మూసివేశారు.
'సెల్ఫ్ లాక్డౌన్ కానీ... దుకాణాలు ఇప్పుడు తెరిచేస్తాం'
వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో స్వతహాగా సెల్ఫ్ లాక్డౌన్ ప్రకటించిన హోల్సేల్ దుకాణదారులు దానిని విరమించుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ లాక్డౌన్ పెట్టే అవకాశాలు ఉండటంతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు వెల్లడించారు.
'సెల్ఫ్ లాక్డౌన్ కానీ... దుకాణాలు ఇప్పుడు తెరిచేస్తాం'
కానీ రానున్న రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ విధిస్తుందనే వార్తల నేపథ్యంలో అప్పటివరకు దుకాణాలు మళ్లీ తెరవాలని అసోసియేషన్ నిర్ణయించింది. ప్రభుత్వం నుంచి అధికార ప్రకటన వచ్చే వరకు షాపులు తెరుస్తున్నట్లు వెల్లడించింది.
ఇవీ చూడండి:కరోనా కలవరం... కొత్తగా 945 మందికి పాజిటివ్