మేడ్చల్ జిల్లా దుండిగల్ పీఎస్ పరిధిలో ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేస్తూ నిర్వహిస్తోన్న రెండు షాపులు, క్లినిక్లపై బాలానగర్ ఎస్ఓటీ పోలీసులు దాడి చేశారు.
లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసు - sot rIDS IN MEDCHAL DISTRICT
కరోనాను ఎదుర్కోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్డౌన్ను కొందరు వ్యాపారులు ఉల్లంఘిస్తున్నారు. మేడ్చల్ జిల్లా దుండిగల్లో నిబంధనలు బేఖాతరు చేస్తూ తెరిచిన దుకాణాలను ఎస్ఓటీ పోలీసులు సీజ్ చేశారు.
![లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసు shops and clinics seized at dundigal in medchal district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6883767-1066-6883767-1587471801872.jpg)
దుండిగల్లో దుకాణాలు సీజ్
మల్లంపేటలో లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించి తెరిచిన ఓ హోటల్, ఎలక్ట్రిక్ షాపును సీజ్ చేశారు. గాగిల్లపూర్, బేరంపేటలో క్లినిక్ తెరిచి వైద్యం చేస్తున్న ఇద్దరు ఆర్ఎంపీ వైద్యులను పట్టుకున్నారు. మొత్తం నలుగురిపై కేసులు నమోదు చేసి వారు నిర్వహిస్తున్న షాపులు, క్లినిక్లను సీజ్ చేశారు. వారిని దుండిగల్ పోలీసులకు అప్పగించారు.