తెలంగాణ

telangana

ETV Bharat / state

హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే అరికెపూడి - హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించిన శేరిలింగంపల్లి ఎమ్మెల్యే

ఆరోవిడత హరితహారం కార్యక్రమాన్ని మేడ్చల్​ జిల్లా హైదర్​నగర్​లో శేరిలింగంపల్లి శాసనసభ్యుడు అరికెపూడి గాంధీ, జోనల్​ కమిషనర్​ ప్రారంభించారు. కిందికుంట చెరువు సుందరీకరణ పనులు చేస్తున్న తనపై ఇతర పార్టీల నాయకులు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.

sherilingampally mla gandhi participated in harithaharam programme
హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించిన శేరిలింగంపల్లి ఎమ్మెల్యే

By

Published : Jun 25, 2020, 11:44 PM IST

మేడ్చల్​ జిల్లా హైదర్​ నగర్​ కిందికుంట చెరువు పరిసరాలలో శేరిలింగంపల్లి శాసనసభ్యుడు అరికెపూడి గాంధీ, జోనల్​ కమిషనర్​ మమత మెుక్కలు నాటి ఆరో విడత హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించారు. చెరువు చుట్టూ 300 మొక్కలు నాటారు. సొంత నిధులతో చెరువు సుందరీకరణ పనులు చేస్తున్న తనపై ఇతర పార్టీల నాయకులు ఆరోపణలు చేస్తున్నారని ఎమ్మెల్యే గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. చెరువు మొత్తం ఎనిమిది ఎకరాల 17 గుంటలు ఉన్న విషయం వాస్తవమేనని 12 ఏళ్ల క్రితం చెరువు ఆక్రమణకు గురైందని ఇప్పుడు ఉన్న స్థలంలో సుందరీకరణ పనులు చేపట్టడం తప్పితే, మరో ఉద్దేశం లేదన్నారు.

చుట్టుపక్కల కాలనీవాసులు, సంక్షేమ సంఘాల వారు గతంలోనే అధికారులకు, నాయకులకు చెరువును శుభ్రం చేసి ఉపయోగకరంగా మార్చాలని వినతి పత్రాలు ఇవ్వడం వల్లనే పనులు చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. లేనిపోని ఆరోపణలు చేస్తూ మంచి పనులకు అడ్డుతగలడం భావ్యం కాదని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇవీ చూడండి: పచ్చని పండుగ: హరిత తెలంగాణే లక్ష్యం... ప్రతిమొక్కనూ బతికిద్దాం

ABOUT THE AUTHOR

...view details