Gun Fire Incident at Shamirpet Update News : మేడ్చల్ జిల్లా శామీర్‌పేట్ సెలబ్రిటీ విల్లాలో కాల్పులు జరిపిన కేసులో నిందితుడిగా ఉన్న మనోజ్‌కు న్యాయస్థానం 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు అతడిని చంచల్‌గూడ జైలుకు తరలించారు. అంతకుముందు మనోజ్‌కు వైద్య పరీక్షలు నిర్వహించి అల్వాల్‌లో జడ్జి ఎదుట ప్రవేశపెట్టారు. ఆయన ఆదేశాల మేరకు.. నిందితుడిపై పోలీసులు ఆర్మ్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి.. చంచల్‌గూడ జైలుకు తీసుకెళ్లారు. సిద్ధార్థ దాస్‌పై కాల్పులు జరిపిన ఎయిర్ తుపాకీని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. స్మితతో సహజీవనం చేస్తున్న మనోజ్ కుమార్ తమను వేధిస్తున్నారని ఆమె కుమారుడు మేడ్చల్- మల్కాజ్గిరి జిల్లా బాలల సంరక్షమ కమిటీకి జూన్ 12న ఫిర్యాదు చేశాడని పోలీసులు వివరించారు.
Manoj Kumar and smitha Gun Fire Case : ఆ ఫిర్యాదులో తన తల్లి తరుఫు బందువుల దగ్గర కూడా ఆ పిల్లలు ఇద్దరు ఉండలేరని పేర్కొన్నారు. దీంతో అప్రమత్తమైన సీడబ్ల్యూసీ అధికారులు బాలుడిని రక్షించి.. సంరక్షణా గృహానికి తరలించారని పోలీసులు తెలిపారు. కుమార్తెతో సహా మేడ్చల్- మల్కాజ్గిరి జిల్లా బాలల సంరక్షణ కార్యాలయానికి ఈ నెల 18న విచారణకు రావాలని సీడబ్ల్యూసీ అధికారులు స్మితకు నోటీసులు ఇచ్చారు.