మేడ్చల్ జిల్లా ఫీర్జాదీగూడ నగర పాలక సంస్థలో పలు అభివృద్ధి పనులను రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి ప్రారంభించారు. తెరాస నాయకుడు బండి శ్రీనివాస్ గౌడ్ ఆరు లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన నిఘా నేత్రాలు, మూడు కోట్లతో చేపట్టనున్న పనులను మంత్రి ఆరంభించారు.
నాయకుల సహకారంతో సీసీ కెమెరాల ఏర్పాటు - The Medchal district has a number of developmental functions within the city administration of Firjadeguda
రాష్ట్రంలో నేరాల నియంత్రణకు కాలనీవాసులు భాగస్వాములు కావాలని రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి పేర్కొన్నారు. దాతల సహకారంతో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు, పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు.
నాయకుల సహకారంతో సీసీ కెమెరాల ఏర్పాటు
రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ బాగా పని చేస్తుందని మంత్రి మల్లారెడ్డి అన్నారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో సుమారు 98 వేల సీసీ కెమెరాలు దాతల సహకారంతో ఏర్పాటు చేశామన్నారు. మరిన్ని సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని, అందుకు దాతలు సహకారం అందించాలని మంత్రి సూచించారు.
ఇదీ చూడండి : తెలంగాణ ఎంపీలతో ప్రధాని మోదీ ప్రత్యేక భేటీ