తెలంగాణ

telangana

By

Published : Nov 4, 2020, 5:40 PM IST

ETV Bharat / state

పట్టభద్రులందరూ ఎమ్మెల్సీ ఓటు కోసం నమోదు చేసుకోండి

పట్టభద్రులందరూ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఓటు హక్కును నమోదు చేసుకోవాలని తెరాస నాయకులు కోరారు. నమోదుకు మరో రెండు రోజులే వ్యవధి ఉన్నందున సికింద్రాబాద్ డివిజన్ లోని అన్ని ప్రాంతాల్లోని ఇంటింటికి వెళ్లి డిగ్రీ అర్హత కలిగిన వారిని గుర్తించాలని సూచించారు. వారందరినీ ఎమ్మెల్సీ ఓటరుగా నమోదు చేయించే బాధ్యత యువ నాయకులు, కార్యకర్తలు తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు.

All graduates enrollment themselves for MLC vote
పట్టభద్రులందరూ ఎమ్మెల్సీ ఓటు కోసం నమోదు చేసుకోండి

పట్టభద్రులందరూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు నమోదు చేసుకోవాలని సికింద్రాబాద్ పార్లమెంటరీ తెరాస ఇంఛార్జీ సాయికిరణ్ యాదవ్ తెలిపారు. సనత్ నగర్ డివిజన్​లోని రాజరాజేశ్వరి నగర్​లో తెరాస యువనాయకులు, తలసాని సాయి కిరణ్ యాదవ్ పర్యటించారు. డిగ్రీ అర్హత ఉన్న యువతీయువకులు ఎమ్మెల్సీ ఓటరు నమోదు కోసం తమ పత్రాలను ఆయనకు అందించారు.

మరో రెండు రోజులే గడువు ఉండటంతో డివిజన్​లోని అన్ని ప్రాంతాల్లో ఇంటింటికి వెళ్లి… డిగ్రీ అర్హత ఉన్నవారిని గుర్తించి.. ఎమ్మెల్సీ ఓటరుగా నమోదు చేయించే బాధ్యత యువ నాయకులు, కార్యకర్తలు తీసుకోవాలని సాయి కిరణ్ సూచించారు. బుధవారం ఒక్కరోజే 125 మంది ఎమ్మెల్సీ ఓటరుకు నమోదు చేయించుకున్నారని కార్పొరేటర్ కొలను లక్ష్మిబాల్ రెడ్డి తెలిపారు.

ఈ కార్యక్రమంలో పలువురు తెరాస మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఇవీ చదవండి: ప్రమాదవశాత్తు మరణించిన కార్మికుడి కుటుంబానికి జీహెచ్ఎంసీ ఆర్థిక సాయం

ABOUT THE AUTHOR

...view details