విద్యార్థులపై కరోనా పంజా విసురుతున్నందున రాష్ట్రంలోని విద్యాలయాలన్ని తాత్కాలికంగా మూసివేస్తూ ప్రభుత్వం ప్రకటన జారీ చేసింది. అయితే కొందరు ఈ నిబంధనలు బేఖాతరు చేస్తూ తరగతులు నిర్వహిస్తున్నారు.
సర్కార్ మూసేయమన్నా.. ఈ సార్లు తెరిచారు... - covid second wave in telangana
కరోనా రెండో దశ వ్యాప్తి దృష్ట్యా ప్రభుత్వం.. రాష్ట్రంలోని విద్యాసంస్థల్ని తాత్కాలికంగా మూసివేసింది. కానీ.. కొన్ని పాఠశాలలు ఈ నిబంధనలు తుంగలోతొక్కి విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తున్నాయి. కొవిడ్ నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయి.

నిబంధనల ఉల్లంఘన, మేడ్చల్ జిల్లా
మేడ్చల్ జిల్లా జగద్గిరిగుట్టలోని ప్రైవేట్ పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తున్నారు. సివిల్ డ్రెస్సులో విద్యార్థులను పాఠశాలకు రప్పిస్తున్నారు. ఈ విషయం గమనించిన స్థానికులు మండల విద్యాధికారి దృష్టికి తీసుకెళ్లారు. ఎంఈఓ ఆ పాఠశాలలకు నోటీసులు జారీ చేస్తానని తెలిపారు. ప్రభుత్వ నిబంధనలను ప్రతి ఒక్కరు తప్పక పాటించాలని కోరారు.
- ఇదీ చదవండి :సైబర్ మోసాల నుంచి జాగ్రత్త పడండిలా..