మేడ్చల్ జిల్లా శామీర్‌పేట్ మండలం అలియాబాద్ సర్పంచ్ గుర్క కుమార్‌ను సస్పెండ్ చేస్తూ... జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు ఉత్తర్వులు జారీ చేశారు. అక్రమ లేఅవుట్లను నిరోధించలేకపోయిన అలియాబాద్, కీసర మండలం అంకిరెడ్డిపల్లి పంచాయతీ కార్యదర్శులపై వేటు పడింది.
అక్రమార్కులపై వేటు వేసిన మేడ్చల్ జిల్లా కలెక్టర్ - aliabad and ankireddy palli latest news
నిధుల దుర్వినియోగం, హరితహారం మొక్కల పెంపకంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన శామీర్‌పేట్ మండలం అలియాబాద్ సర్పంచ్ గుర్క కుమార్‌పై సస్పెన్షన్ వేటు పడింది. మేడ్చల్ జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు ఉత్తర్వులు జారీ చేశారు.
![అక్రమార్కులపై వేటు వేసిన మేడ్చల్ జిల్లా కలెక్టర్ sarpanch and panchayat secretary suspended due to illegal fund transfer and careless in haritha haram plants in aliabad village shamirpet medchal district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7855859-241-7855859-1593662965152.jpg)
అక్రమార్కులపై వేటు వేసిన మేడ్చల్ జిల్లా కలెక్టర్
నిధుల దుర్వినియోగం, హరితహారంలో నాటిన మొక్కల పెంపకంలో నిర్లక్ష్యం, గ్రామంలో వేలిసిన అక్రమ లేఅవుట్లను అరికట్టలేకపోయారని వచ్చిన అభియోగాలపై డీపీవో విచారణ జరిపింది. డీపీవో నివేదిక ఆధారంగా సస్పెండ్ చేస్తున్నట్లు కలెక్టర్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఇదీ చూడండి:కేయూ ఉపకులపతి నియామకంపై తొలగని ప్రతిష్ఠంభన