తెలంగాణ

telangana

ETV Bharat / state

కేటీఆర్​ పిలుపుతో అడవిని దత్తత తీసుకున్న సంతోష్​ - కేటీఆర్​ పిలుపుతో అడవిని దత్తత తీసుకున్న సంతోష్​

కేటీఆర్​ పుట్టిన రోజు సందర్భంగా గిఫ్ట్​ ఏ స్మైల్​ కార్యక్రమంలో భాగంగా కీసరగుట్ట రిజర్వ్​ ఫారెస్టును రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్​కుమార్​ దత్తత తీసుకున్నారు. తన ఎంపీ నిధులతో అభివృద్ధి చేస్తానని ప్రకటించారు.

కేటీఆర్​ పిలుపుతో అడవిని దత్తత తీసుకున్న సంతోష్​

By

Published : Jul 23, 2019, 4:53 PM IST

తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా చేపట్టిన గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్​కుమార్ కీసరగుట్ట రిజర్వ్ ఫారెస్టును దత్తత తీసుకున్నారు. తన ఎంపీ నిధులతో 2042 ఎకరాల అటవీ ప్రాంతాన్ని అభివృద్ధి చేయనున్నట్లు ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పట్టణ అటవీ పార్కుల అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా కీసర రిజర్వ్ ఫారెస్టును సుందరంగా తీర్చిదిద్దనున్నట్లు సంతోష్ వెల్లడించారు. త్వరలో కీసర అటవీ ప్రాంతంలో పర్యటించి, అభివృద్ది ప్రతిపాదనలు సిద్ధం చేస్తామన్నారు. తెలంగాణ ప్రభుత్వం అభివృద్ది చేస్తున్న అర్బన్ ఫారెస్ట్ పార్కులు అద్భుతంగా ఉన్నాయని, పట్టణ ప్రాంత వాసులు సేదతీరేందుకు, ఆరోగ్యకర జీవనవిధానం అలవర్చుకునేందుకు ఇవి తోడ్పాటునిస్తాయని సంతోష్ అన్నారు. కీసరగుట్ట అటవీ ప్రాంతాన్ని మంచి ఎకో టూరిజం ప్రాజెక్టుగా తీర్చి దిద్ది హైదరాబాద్ వాసులకు బహుమతిగా ఇస్తామన్నారు.

కేటీఆర్​ పిలుపుతో అడవిని దత్తత తీసుకున్న సంతోష్​

ABOUT THE AUTHOR

...view details