సంక్రాంతి పండుగను పురస్కరించుకుని.. మేడ్చల్ జిల్లా నాగారం మున్సిపాలిటీ గాంధీనగర్లో శ్రీ సిద్ధి వినాయక అసోసియేషన్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళలు రంగు రంగుల ముగ్గులు వేసి అలరించారు.
చూపరులను కట్టిపడేస్తోన్న రంగవల్లులు - మేడ్చల్ జిల్లా
సంక్రాంతి పండుగ సందర్భంగా మేడ్చల్ జిల్లా నాగారంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు, యువతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
చూపరులను కట్టిపడేస్తోన్న రంగవల్లులు
పండుగ సంస్కృతి, సంప్రదాయాలను గుర్తుకుచేస్తూ మహిళలు వేసిన రంగవల్లులు చూపరులను కట్టిపడేశాయి. పోటీలలో గెలుపొందిన వారికి సంస్థ ప్రతినిధులు బహుమతులను అందజేశారు.
ఇదీ చదవండి:అంబరాన్నంటిన సంక్రాంతి సంబరాలు