లాక్డౌన్ నేపథ్యంలో మేడ్చల్ జిల్లా కొంపల్లిలోని సైన్మా రెస్టారెంట్ యాజమాన్యం పేదలు, వలసకూలీలు, అనాథలకు భోజనం అందిస్తోంది. రెస్టారెంట్ ఆధ్వర్యంలో ప్రతిరోజు 1300 మందికి గత 28 రోజులుగా నాణ్యమైన భోజనం, పండ్లను అందిస్తున్నారు. ఇవాళ రాష్ట్ర మాజీ ప్రత్యేక రక్షణ అధికారి తేజ్‌దీప్‌కౌర్ బాలానగర్‌లోని పేదలకు ఆహారం అందించారు. నిత్యం భోజనం సరఫరా చేస్తున్న సైన్మా రెస్టారెంట్ యాజమాన్యాన్ని అభినందించారు. వీటితో పాటు సిక్ సొసైటీ ఆధ్వర్యంలో అనేక గ్రామాల్లో నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నట్లు తేజ్‌దీప్‌కౌర్ వెల్లడించారు.
పేదల కడుపు నింపుతోన్న సైన్మా రెస్టారెంట్ యాజమాన్యం - food for people
లాక్డౌన్ నేపథ్యంలో ఆకలితో అలమటిస్తున్న పేదలకు సైన్మా రెస్టారెంట్ యాజమాన్యం ఆపన్నహస్తం అందిస్తోంది. ప్రతిరోజు 1300 మందికి భోజనం, పండ్లను పంపిణీ చేస్తున్నారు.
పేదల కడుపు నింపుతోన్న సైన్మా రెస్టారెంట్ యాజమాన్యం
ప్రతిరోజు రెస్టారెంట్‌కు సంబంధించిన యువకులు సందీప్ రెడ్డి, అక్షయ్ రెడ్డిలు వారికి తోచిన విధంగా సహాయం చేయడంతో పాటు అనేక మంది దాతలను భాగస్వామ్యం చేసి నాణ్యమైన, రుచికరమైన భోజనం అందించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.
ఇవీ చూడండి: కాల్వల భూసేకరణకు రైతులు ముందుకు రావాలి: హరీశ్‌రావు