తెలంగాణ

telangana

ETV Bharat / state

జీడిమెట్ల డిపోలో కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె

ఆర్టీసీను వెంటనే రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకుని ఆర్టీసీ కార్మికులకు ఉద్యోగ భద్రత కలిపించి నష్టాల ఊబిలో ఉన్న ఆర్టీసీని ఆదుకోవాలని కుత్బుల్లాపూర్​ సీపీఎం, కాంగ్రెస్ నాయకులు డిమాండ్​ చేశారు.

జీడిమెట్లలో ఆర్టీసీ కార్మికుల సమ్మె

By

Published : Oct 9, 2019, 3:02 PM IST

రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు చేస్తున్న బంద్​ ఐదో రోజుకు చేరుకుంది. హైదరాబాద్ జీడిమెట్ల బస్​ డిపో వద్ద కుత్బుల్లాపూర్ నియోజకవర్గ సీపీఎం, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా ధర్నా చేశారు. పోలీసులు వీరికి సర్దిచెప్పి పంపగా... కార్యకర్తలు బస్ డిపో నుంచి షాపూర్​నగర్​ వరకు ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సమ్మెను పట్టించుకోకుండా ఉద్యోగులను తొలగించడం అన్యాయమని.. ప్రభుత్వం వీరి సమస్యలను పరిష్కరించేవరకు సమ్మెకు పూర్తి మద్దతిస్తామని కాంగ్రెస్ నేత శ్రీశైలం గౌడ్ తెలిపారు. ఆ ప్రాంతంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.

జీడిమెట్లలో ఆర్టీసీ కార్మికుల సమ్మె

ABOUT THE AUTHOR

...view details