మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్ పట్టణంలో తెలంగాణ కార్మికుల సమాఖ్య 14వ రాష్ట్ర మహాసభను ఐతే సాయన్న ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీఎస్పీ రాష్ట్ర కో ఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. నాటి స్వర్ణాంధ్రే... నేటి బంగారు తెలంగాణగా నినాదం మారింది కానీ.. రాష్ట్ర ప్రజలకు ఒరిగిందేమి లేదని ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు.
'బీఎస్పీ అనేది అక్షరం, ఆరోగ్యం, ఆర్థికం, ఆత్మగౌరవం. ఒకరికి బీఎస్పీ అమ్ముడుపోదు. అమ్మదు. తాకట్టు పెట్టదు. మడమ తిప్పదు, మాట తప్పదు. తరతరాలుగా ఈ పాలకులు చేస్తున్న కుట్రలకు వ్యతిరేకంగా... ప్రజాబాహుళ్యాన్ని అక్షరాలతో చైతన్యం చేస్తాం. రాబోయే రోజుల్లో ఆ అక్షరాలనే ఇందనంగా, ఆయుధంగా వాడి... ప్రస్తుత పాలనకు వ్యతిరేకంగా ముందుకు వెళ్తాం. దేశంలోనే నిరక్షరాస్యత లేకుండా చూస్తాం.