తెలంగాణ

telangana

ETV Bharat / state

ఓఆర్​ఆర్​పై ప్రమాదం.. ఒకరు మృతి

మేడ్చల్ జిల్లా దుండిగల్ పరిధిలో ఔటర్​ రింగ్​ రోడ్డుపై జరిగిన ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. మరో ఇద్దరికి గాయాలయ్యాయి.

By

Published : Dec 30, 2019, 10:29 PM IST

Road accident on or
ఓఆర్​ఆర్​పై ప్రమాదం

మేడ్చల్ జిల్లా దుండిగల్ పరిధిలో ఔటర్​ రింగ్​ రోడ్డుపై ఆగివున్న లారీని.. మరో లారీ ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా.. ఇద్దరు పోలీసులకు స్వల్ప గాయాలయ్యాయి. ఓఆర్ఆర్​పై లారీ (టీఎన్​24ఏడీ 0698) కొల్లూరు నుంచి వరంగల్ వెళ్తుండగా మార్గమధ్యంలో దుండిగల్ వద్ద లారీ జాయింట్ బోల్ట్ ఉండిపోయింది. లారీని పక్కకు ఆపి క్లీనర్ యాకుబ్ సరిచేస్తుండగా.. పోలీస్ పెట్రోలింగ్ వాహనం ఘటనా స్థలానికి చేరుకుంది. పోలీసులు క్లీనర్​తో మాట్లాడుతుండగా గుర్తుతెలియని మరో లారీ వెనక నుంచి పోలీస్ పెట్రోలింగ్ వాహనాన్ని ఢీకొట్టింది.

పోలీస్ వాహనం రిపేర్ చేస్తున్న లారీ క్లీనర్​ను బలంగా తాకగా.. పోలీసు వాహనానికి లారీకి మధ్యలో ఇరుక్కుపోయి క్లీనర్ యాకుబ్ అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ప్రమాదంలో హోంగార్డు హరికిషన్, హెడ్ కానిస్టేబుల్ నవీన్​కు స్వల్ప గాయలవగా.. ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఓఆర్​ఆర్​పై ప్రమాదం.. ఒకరు మృతి

ఇవీ చూడండి: 'తనిఖీ నివేదికలు సమర్పించకుంటే నుమాయిష్ నిర్వహించొద్దు'

ABOUT THE AUTHOR

...view details