మేడ్చల్ పీఎస్ పరిధిలో జాతీయ రహదారిపై టిప్పర్ లారీ ఢీకొని మహిళ మృతి చెందగా... మరో వ్యక్తి తీవ్రంగా గాయపడిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. మేడ్చల్ మండలం సైదొని గడ్డ తండాకు చెందిన బానోతు రేణుక(38) తన కొడుకు శశికాంత్ ద్విచక్ర వాహనంపై మేడ్చల్‌కు వ్యక్తిగత పనిపై వచ్చి తిరిగి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.
ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన టిప్పర్.. ఓ మహిళ మృతి - medchal district news
ద్విచక్ర వాహనాన్ని టిప్పర్ లారీ ఢీకొట్టిన ఘటన మేడ్చల్ పీఎస్ పరిధిలో జరిగింది. ఈ ఘటనలో ఓ మహిళ మృతి చెందగా, మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన టిప్పర్... ఓ మహిళ మృతి
మేడ్చల్‌లోని ముకుంద్ థియేటర్ ఎదురుగా వెనుక నుంచి వేగంగా వచ్చిన టిప్పర్ ఢీకొనడం వల్ల రేణుక కింద పడగా, తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందింది. శశికాంత్‌కు తీవ్ర గాయాలు కాగా.. కొంపల్లిలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ప్రవీణ్ రెడ్డి తెలిపారు.
ఇవీ చూడండి: బాలింత మృతి.. బంధువుల ఆగ్రహం