మేడ్చల్ జిల్లా బహదూర్‌పల్లిలో పోలీసులు ఏర్పాటు చేసిన చెక్ పోస్టు వద్ద ఓ ద్విచక్రవాహనదారుడు ఆపకుండా సురారం వైపు వెళ్లాడు. అతన్ని పట్టుకోవడానికి ఆ వెనకే వస్తున్న మరో బైక్‌పై కానిస్టేబుల్ రామచంద్రయ్య కూర్చొని వెంబడించే క్రమంలో సురారం కట్టమైసమ్మ చెరువు మలుపు వద్ద అదుపుతప్పి కింద పడ్డారు.
బైకర్‌ను పట్టుకోబోయి రోడ్డు ప్రమాదం.. కానిస్టేబుల్‌కు గాయాలు - medchal latest news
ఓ ద్విచక్రవాహనదారుడిని పట్టుకోబోయి పోలీస్ కానిస్టేబుల్‌తోపాటు ఓ వ్యక్తి గాయపడిన ఘటన మేడ్చల్ జిల్లా సురారంలో జరిగింది. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు.
సురారంలో రోడ్డు ప్రమాదం.. కానిస్టేబుల్‌కు గాయాలు
ద్విచక్ర వాహనదారుడికి స్వల్ప గాయాలు కాగా దుండిగల్ కానిస్టేబుల్ రామచంద్రయ్య తలకు బలమైన గాయమైంది. అతడికి సురారం నారాయణ మల్లారెడ్డి ఆస్పత్రిలో ప్రథమ చికిత్స అందించిన అనంతరం సికింద్రాబాద్ యశోదకు తరలించారు.