రోడ్డు దాటుతున్న ఇద్దరు వ్యక్తులను లారీ ఢీకొట్టిన ఘటన మేడ్చల్ జిల్లా పేట్‌బషీర్‌బాద్ పరిధి సుచిత్ర వద్ద జరిగింది. ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. మృతుడు నేపాల్‌కు చెందిన భీమ్‌సింగ్‌గా గుర్తించారు.
పేట్‌బషీర్‌బాగ్‌లో రోడ్డు ప్రమాదం... ఒకరు మృతి - పేట్ బషీర్‌బాగ్‌లో రోడ్డు ప్రమాదం
మేడ్చల్ జిల్లా పేట్‌బషీరాబాద్ పరిధి సుచిత్రలో రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుదాటుతున్న ఇద్దరు వ్యక్తులను లారీ ఢీ కొట్టిన ఘటనలో ఒకరు మృతిచెందగా మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు.
పేట్‌బషీర్‌బాగ్‌లో రోడ్డు ప్రమాదం... ఒకరు మృతి
ఘటనా స్థలిని పరిశీలించిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుడిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. పాదచారులిద్దరు మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.