తెలంగాణ

telangana

ETV Bharat / state

ద్విచక్రవాహనంపై వెళ్తున్న యువకుడిని ఢీ కొట్టిన టిప్పర్​ - ద్విచక్రవాహనంపై వెళ్తున్న యువకుడిని ఢీ కొట్టిన టిప్పర్​

ఉద్యోగానికి వెళ్తుండగా మార్గమధ్యంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన ఘటన దుండిగల్​ పరిధిలోని బహదూర్ పల్లి జరిగింది.

road accident at dundiga
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

By

Published : Dec 20, 2019, 6:35 PM IST

దుండిగల్​ ఠాణా పరిధిలోని బహదూర్​ పల్లి వద్ద గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న యువకుడిని వెనుక నుంచి టిప్పర్ ఢీ కొట్టిన ఘటనలో ప్రాణాలు కోల్పోయాడు. మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లికి చెందిన అనిల్ కుమార్ డిగ్రీ చదివాడు. ఇటీవలే ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగంలో చేరాడు. విధులకు హాజరయ్యేందుకు ఇంటి నుంచి షాపూర్​నగర్​కు ద్విచక్రవాహనంపై బయలుదేరాడు. మార్గమధ్యలో బహదూర్​పల్లి వద్ద టిప్పర్ వెనుక నుంచి ఢీకొట్టింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన యువకుడిని స్థానికులు సూరారంలోని ఆసుపత్రి తరలించేలోపే మృతిచెందాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదుపై కేసునమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

తల్లి వేదన వర్ణనాతీతం

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

పదిహేనేళ్ల క్రితం భర్త చనిపోయినప్పటి నుంచి ముగ్గురు ఆడపిల్లలు, కుమారుడిని కష్టపడి పెంచి పెద్ద చేసింది. చేతికందొచ్చిన కొడుకు కుటుంబాన్ని ఆదుకుంటాడనుకున్న సమయంలో మృత్యువు కబళించడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.

ఇదీ చూడండి: ప్రాణం మీదికొచ్చిన చిన్నపాటి గొడవ

ABOUT THE AUTHOR

...view details